
నవంబర్ 15, 2025 10:08AMన పోస్ట్ చేయబడింది
.webp)
తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసి.. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ అనే సీఐ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. దీంతో సతీష్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మృతుడు సతీష్ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
సిట్ ఎదుట హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శుక్రవారం (నవంబర్ 14)న మరణించి రైలు పట్టాలపై పడి ఉన్నారు. దీంతో ఆయనది అనుమానాస్పద మృతిగా అందరూ భావించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ వైసీపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రైలు ఢీకొనడం వల్ల చనిపోయారన్నట్లుగా సీన్ క్రియేట్ చేసిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో సతీష్ ది హత్యే అని తేలడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
అయితే వైసీపీ మాత్రం దర్యాప్తు అధికారులు, తెలుగుదేశం నేతల వేధింపుల కారణంగానే సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అలాగే సతీష్ ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చింది.
టీటీడీ మాజీ చైర్మర్ భూమన కరుణాకరరెడ్డి అయితే.. ఈ ఆరోపణలు, డిమాండ్లతో అతి వికటించింది. అత్యంత కీలకమైన కేసులో ఫిర్యాదుదారు, సాక్షి అయిన ఓ పోలీసు అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. మామూలుగా అయితే ఆయన హత్యకు పాల్పడ్డారు అని వైసీపీ ఆరోపణలు చేయాలి. కానీ.. అసలు ఆయన ఎలా చనిపోయారు అన్నది ఇంకా తేలక ముందే ఆత్మహత్య అంటూ ఆరోపణలు గుప్పించడం చూస్తుంటే.. గతంలో అంటే వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు మొదట గుండెపోటు అంటూ ప్రచారం చేసిన విధానం గుర్తుకు వస్తోంది. ఇక భూమన అయితే.. ఓ దర్యాప్తు అధికారిని కూడా టార్గెట్ చేసి బెదిరించేలా ఆరోపణలు గుప్పించడం పలు సందేహాలకు తావిస్తోంది. గతంలో వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై కూడా వైసీపీ నేతలు ఇలాగే టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించడం, కేసులు పెట్టడం తెలిసిందే.
ఇప్పుడు విషయానికి వస్తే అప్పట్లో టీటీడీ విజిలెన్స్ లో పని చేస్తున్న సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకే పరకామణి చోరీ కేసు నమోదు అయింది. తర్వాత ఆయనపై ఒత్తిడి తెచ్చి కేసు రాజీ చేశారు. ఎవరు అలా చేశారన్నది సిట్ కు ఆయన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. ఆ వాంగ్మూలం ఇచ్చేందుకు వెడుతున్న సమయంలోనే సతీష్ మరణించారు. ఇక్కడే సతీష్ మృతి వెనుక ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
