
నవంబర్ 14, 2025 1:41PMన పోస్ట్ చేయబడింది
.webp)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే ట్రెండ్స్ ను బట్టి ఈ ఎన్నికలలో ఘన విజయంతో ఎన్డీయే రాష్ట్రంలో మరో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయంగా తేలిపోయింది. ఇప్పటి వరకూ ఉన్న అధికారతల ప్రకారం ఎన్డీయే కూటమి అభ్యర్థులు 191 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని మహాఘట్ బంధం 49 స్థానాల్లో మాత్రమే అధికారం కనబరుస్తోంది.ఎన్టీయే కూటమిలో బీజేపీ 84 స్థానాల్లోనూ, జేడీయూ 80 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
శుక్రవారం(నవంబర్ 14) ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీయే మెజారిటీ స్థానాల్లో అధిక్యత కనిపిస్తోంది.
కాగా ఈ ట్రెండ్ చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతోందని సీపీఐ నాయకుడు రాజా అన్నారు. ప్రచారంలో మహాఘట్ బంధన్, తేజస్వీ యాదవ్ లానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
ఇక కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ బీహార్ ఫలితాలను చూసిన తరువాతైనా పార్టీలో ఆత్మపరిశీలన జరగాల్సి ఉంది. కేవలం ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోదనీ, కూర్చుని ఆలోచించాలనీ, ఎం తప్పు జరిగింది? ఎక్కడ జరిగింది అన్న విషయాలపై పార్టీలో విస్తృత చర్చ జరగాలని, సంస్థాగత తప్పులు ఏమిటన్నదానిపై అధ్యయనం జరగాలని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.
ఇక బీహార్ ఎన్నికలలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జన సురాజ్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఈ పార్టీ మొత్తం స్థానాల్లో పోటీ చేసినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా విఫలమయ్యాయి.
