

బాలీవుడ్ తలపెట్టిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే అది ఆగిపోవడం వల్ల.. గతంలో ఆగిపోయిన జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ప్రాజెక్ట్ లో కదలిక వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్‌లో భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్క్రిప్ట్ విషయంలో సంతృప్తి చెందింది.. ఈ ప్రాజెక్ట్ ని నిలిపిట్లు వార్తలొస్తున్నాయి. ఇది ఓ రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో ‘మేడ్ ఇన్ ఇండియా’ పేరుతో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రకటన వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తాడని న్యూస్ వినిపించింది.
ఇది కూడా చదవండి: స్పిరిట్ లో చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి!
అయితే ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్ట్ లతో ఉండటం, మరోవైపు ఫాల్కే బయోపిక్ కోసం అమీర్ ఖాన్-హిరానీ వారి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవడంతో.. ‘మేడ్ ఇన్ ఇండియా’ హోల్డ్ లో పడిపోయింది.
ఇప్పుడు అనూహ్యంగా అమీర్ ఖాన్-హిరానీ తలపెట్టిన ఫాల్కే బయోపిక్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.. మళ్లీ ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్‌లో వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ గొప్ప నటుడు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటిస్తే.. నటుడిగా మరింత స్కోప్ ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేయడానికి ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
