

స్వయంకృషితో ఎదిగిన టాలీవుడ్ స్టార్స్ లో మాస్ మహారాజా రవితేజ(రవితేజ) ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలు టాప్ స్టార్స్ కి పోటీగా కలెక్ట్ చేసేవి. అలాంటి రవితేజ, ఇప్పుడు వెనకబడిపోయారు. వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. కొన్ని సినిమాలు రూ.10 కోట్ల షేర్ రాబట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి. అసలు రవితేజకి ఏమైంది? ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి? అనే చర్చ జరుగుతోంది.
రవితేజ అంటే యాక్షన్ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు. కామెడీ, యాక్షన్, లవ్, ఎమోషన్స్ తో.. ఫుల్ మీల్స్ లా ఆయన సినిమాలు ఉండేవి. మధ్య మధ్యలో ప్రయోగాలు చేసి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ.. యాక్షన్ ఎంటర్టైనర్స్ తో అదిరిపోయే కమర్షియల్ సక్సెస్ లు చూసేవారు. కానీ, ఇప్పుడు సక్సెస్ లు ఆయనను పెద్దగా పలకరించడం మానేశాయి.
ఎలాంటి సినిమాలు చేయాలి? అనేది ఇప్పుడు రవితేజకు పెద్దగా క్వశ్చన్ మార్క్ లా అయిపోయింది. ప్రయోగాలు చేస్తే.. ఇలాంటి సినిమాలు వద్దు, వింటేజ్ రవితేజను గుర్తుచేసే ఎంటర్టైనర్స్ కావాలని అభిమానులు కోరుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తే.. ఇంకెంత కాలం ఇవే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు, అవే హీరోయిన్ తో స్టెప్పులు.. కొత్త తరహా సినిమాలు చేయాలని అంటున్నారు. దీనితో సినిమాల ఎంపికలో రవితేజ తడబడుతున్నారని అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి: గ్లోబ్ ట్రాటర్.. సౌండ్ లేకుండా వచ్చిన సాంగ్.. రెస్పాన్స్ ఎలా ఉంది?
ఇటీవల ‘మాస్ జాతర’తో నిరాశపరిచిన రవితేజ.. 2026 సంక్రాంతికి ‘భక్తి మహాశయులకు విజ్ఞప్తి’తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఎంటెర్టైనర్ గా ఫ్యామిలీతోన్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. కొందరు ఇది కూడా రెగ్యులర్ గా ఉండాలని కామెంట్స్ చేస్తున్నప్పటికీ.. మెజారిటీ ఆడియన్స్ మాత్రం గ్లింప్స్ బాగుందని, సంక్రాంతికి కరెక్ట్ సినిమా అని, ఇలాంటి సినిమాలు చేయాలని అభిప్రాయపడ్డారు. (భర్త మహాశయులకు విజ్ఞప్తి)
నిజానికి ఆడియన్స్ ని మెప్పించాలంటే జానర్ ముఖ్యం కాదు. ఏ జానర్ అయినా కంటెంట్ కరెక్ట్ గా ఉండాలి. రవితేజ నటించిన మాస్ జాతర సినిమాలనే గమనిస్తే.. రెండు క్రాస్ యాక్షన్ ఎంటెర్టైనర్సే. కానీ, కంటెంట్ పరంగా క్రాక్ మెప్పించింది. అంటే రవితేజ ఎలాంటి సినిమా చేసినా.. కంటెంట్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఇదే ఇప్పుడు కొందరు అభిమానులు రవితేజకు సూచిస్తున్నారు. చూద్దాం మరి ‘భక్తి మహాశయులకు విజ్ఞప్తి’తోనైనా రవితేజ హిట్ ట్రాక్‌లోకి వస్తారేమో.
