
నవంబర్ 11, 2025 8:23AMన పోస్ట్ చేయబడింది
.webp)
బాలీవుడ్ దిగ్గజ నటుడు, సీనియర్ హీరో ధర్మేంద్ర మంగళవారం (నవంబర్ 11) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 89 ఏళ్లు. ఇటీవల ఆయన శ్వాసకోశ సమస్యలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్ర అప్పటి నుంచీ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి ఈ ఉదయం తుది శ్వాస విడిచారు.
హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా ధర్మేంద్ర పేరు తెచ్చుకున్నారు. ధర్మేంద్ర మృతి పట్ల పలువురు సినీ , రాజకీయప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పలు విజయవంతమైన సినిమాలలో నటించిన ధర్మేంద్రకు 2012లో పద్మభూషణ్ పురస్కారం దక్కింది. అంతకు ముందు 1997లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం అందుకున్నారు.
ధర్మేంద్రను కడసారి చూసేందుకు పలువురు సినీ తారలు ఆసుపత్రికి చేరుకున్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, సహా పలువురు ప్రముఖులుఅయనకు నివాళులర్పించారు. 1958లో దిల్ బీ తేరా హ’మ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర, తన కెరీర్‌లో షోలే , చుప్కే చుప్కే , ధర్మ్ వీర్ , సీతా ఔర్ గీత , యాదోం కి బారాత్ వంటి ఎన్నో సినిమాలలో తన అసమాన నటనతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అభిమానులు ధర్మేంద్రను హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అని పిలుచుకుంటారు. ప్రముఖ హీరోయిన్, బీజేపీ నాయకురాలు హేమమాలిని ఆయన భార్య.
