

భారతీయ సిల్వర్ స్క్రీన్ పై ధర్మేంద్ర(ధర్మేంద్ర)కి ఉన్న సినీ చరిష్మా అంతటి ప్రత్యేకత. యాక్షన్ హీరోగా ,ఎవర్ గ్రీన్ హీరోగా సిల్వర్ స్క్రీన్ పై తన కంట ఒక చరిత్రనే సృష్టించుకున్నాడు. కొన్ని రోజుల నుంచి ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. చివరకి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు.
ధర్మేంద్ర కి ఇద్దరు భార్యలు. ఒకరు ప్రకాశ్ కౌర్ కాగా, ఇంకొకరు హేమమాలిని. భారతీయ సినిమా రంగంలో నటిగా హేమమాలిని సృష్టించిన సంచలనం అందరకీ తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి డ్రీమ్ గర్ల్ గా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తొలి భార్య సంతానం. ఆ ఇద్దరు రీసెంట్ గా తమ చిత్రాలతో సందడి చేస్తూ వస్తున్నారు. ప్రముఖ హీరోయిన్లు ఇషా డియోల్ ,అహనా డియోల్ కూడా నటన పరంగా బాలీవుడ్ లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ఇక ధర్మేంద్ర కెరీర్ పరంగా చూసుకుంటే 1975లో అమితాబ్ తో కలిసి చేసిన ‘షోలే’ మూవీలో వీరూ క్యారక్టర్ లో ఎనలేని ఖ్యాతిని సంపాదించారు. ఆ తర్వాత అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ వంటి చిత్రాలే కాకుండా ఎన్నో వైవిద్యమైన చిత్రాలలో నటించి ఆ క్యారెక్టర్స్ కి ప్రాణ ప్రతిష్ట కూడా చేసారు.సుదీర్ఘ కాలం పాటు కెరీర్‌లో సుమారు 300 చిత్రాలు చేసారు. డిసెంబర్ 8 ,1935 న జన్మించారు. పంజాబ్ రాష్ట్రంలో లూథియానా ఏర్పాటు ఖన్నా తహసీల్ ధర్మేంద్ర గారి నేటివ్ ప్లేస్.
