
నవంబర్ 10, 2025 12:36PMన పోస్ట్ చేయబడింది

అరెస్టైన వారిలో హైదరాబా డాక్టర్
మరో ఘటనలో హరియాణా డాక్టర్ నివాసంలో భారీగా ఆర్డీఎక్స్ స్వాధీనం
భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఐఎస్ఐఎస్‌తో సంబంధాలు ఉన్న ముగ్గురిని అహ్మదాబాద్‌లో ఆదివారం (నవంబర్ 9) అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసుల కథనం అరెస్టు అయిన వారిపై గత ఏడాదిగా నిఘా పెట్టారు. ఇప్పుడు వారు పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులు ఆయుధాలు మార్పిడి చేసుకున్న గుజరాత్ కు వచ్చారని, అలాగే దేశంలోని వివిధ దేశాల్లో ఉగ్రదా డులు చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు ఐటీఎస్ అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ కారణంగా హైదరాబాద్ లో కలకలం రేపింది. హైదరా బాద్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఫ్రాన్స్‌లోఎంబీబీఎస్ పూర్తి చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. వైద్యుడైన తన ఇంటినే ప్రయోగశాలగా మార్చి.. సైనైడ్ ను తలదన్నేలాంటి అత్యంత ప్రమాదకరమైన రైసిన్ అనే విష రసాయనాన్ని తయారు చేయడం కలకలం రేపుతోంది.
మొహియుద్దీన్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్‌లను అహ్మదాబాద్ సమీపంలోని అదాలజ్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సులేమాన్, సలీంఖాన్‌లు ఢిల్లీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్ వంటి సున్నిత ప్రాంతాల విధ్వంసం కోసం రెక్కీ నిర్వహించారని, పాకిస్థాన్ సరిహద్దు నుంచి డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు సేకరించారని ఏటీఎస్. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరంతా, రైసిన్ ఉపయోగించి దేశంలో పెను విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్. వీరిలో హైదరాబాద్ రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో నివసించే డాక్టర్ మొహియుద్దీన్ తన ఇంట్లోనే ఆముదం గింజల వ్యర్థాల నుంచి రైసిన్ తయారు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గుజరాత్ లో మొహియుద్దీన్ అరెస్ట్ తో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గుజరాత్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అతడి నివాసంలో తనిఖీలు చేశారు. నగరంలో మొహియుద్దీన్‌కు ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా ఉగ్రకుట్రను భద్రతా దళాలు సోమవారం భగ్నం చేశాయి. ఇంటిలిజెన్స్ బ్యూరో, జమ్ముకశ్మీర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంట్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
దాదాపు 300 కేజీల ఆర్డీఎక్స్, ఏకే 47, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం, జమ్ముకశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్‌లో డాక్టర్ ఆదిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా భద్రతా సంస్థలు ఈ దాడులు నిర్వహిస్తున్నాయి. నవంబర్ 6న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కి మద్దతుగా పోస్టర్లు అతికించారనే ఆరోపణలతో డాక్టర్ ఆదిల్ రాథర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పుడు అతడి నివాసంలో భారీ స్థాయిలో ఆర్డీఎక్స్ అలాగే ఏకే 47 లభ్యమైంది. ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పెద్ద భారీ కుట్రకు ప్లాన్ చేశారు భద్రతా బలగాల సమాచారం.
