
నవంబర్ 7, 2025 9:09AMన పోస్ట్ చేయబడింది

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు అత్యంత కీలకంగా మారాయి. మూడు పార్టీలూ ఈ ఉప ఎన్నికలో విజయాన్ని చావో రేవో అన్నట్లుగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు జూబ్లీ ఉప ఎన్నిక పార్టీలకూ అగ్నిపరీక్షగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రచార వేడి రోహిణీకార్తెను మించిపోతున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గాలు హోరెత్తిపోతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ఈ తీరు పెరిగిపోతోంది.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. 14న వెలువడుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో నిలిచారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం (నవంబర్ 6) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉంటుంది. బోరబండ డివిజన్లో ప్రారంభమైన ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్పై ఘాటు విమర్శలు చేశారు. తాను కట్టర్ హిందువునని, ఇతర మతాలకు చెందిన వారి టోపీ పెట్టుకుని, దొంగ నమాజ్ చేసి కించపర్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే తల నరుక్కుంటా గానీ టోపీ పెట్టుకోన్నారు. మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని తెలిపారు. ఈ మాట స్వయంగా గోపీనాథ్ తల్లి చెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు వావి వరసల్లేవని, చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా. సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకమని తీవ్ర విమర్శలు గుప్పించారు.తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకోవాలంటూ కల్వకుంట్ల కవితకు హితవు చెప్పారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు తినేటోడు వచ్చాడని. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఆడోళ్ల మెడల్లో ఉన్న మంగళసూత్రాలు కూడా గుంజుకుపోతారని బండి సంజయ్ అన్నారు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డిని చూస్తే సినిమా నటుడు వేణుమాధవ్ గుర్తొచ్చాడని బండి అన్నారు.