
నవంబర్ 6, 2025 9:41AMన పోస్ట్ చేయబడింది

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య గురువారం (నవంబర్ 6) కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గన్నవరం శివారులోని రుషివాటిక వృద్ధుల నిలయంలో గురువారం (నవంబర్ 5) ఉదయం తుదిశ్వాస విడిచారు. జానకిరామయ్య 27 సంవత్సరాలపాటు విజయ డెయిరీ ఛైర్మన్గా సేవలందించారు. జానకిరామయ్యకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
డెయిరీ రంగానికి ఆయన అందించిన విశిష్ఠ సేవకు గాను జానకిరామయ్యకు 2012లో డాక్టర్ కురియన్ అవార్డు లభించింది. ఆయన మృతి పట్ల చాలా సంతాపం వ్యక్తం చేశారు. మండవ జానకిరామయ్య అంత్యక్రియలు గురువారం (నవంబర్ 6) సాయంత్రం ఆయన స్వగ్రామమైన మొవ్వలో జరుగుతాయి.
