Home సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ – ACPS NEWS

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ – ACPS NEWS

by
0 comments
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ



సినిమా పేరు: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
తారాగణం: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని, మాస్టర్ రోషన్ చేశారు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఎడిటర్: నరేష్ అడపా
రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్
సినిమాటోగ్రాఫర్: సోమశేఖర్
బ్యానర్స్ : పప్పెట్ షో ప్రొడక్షన్, 7పీఎం ప్రొడక్షన్
నిర్మాత: సందీప్ అగరం
విడుదల తేదీ: నవంబర్ 7 2025

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా చేసిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'(ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)థియేటర్స్‌లోకి అడుగుపెట్టింది. ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో మూవీ లవర్స్ ‘వెడ్డింగ్ షో’ పై తమ ఫోకస్ ని ఉంచారు. సినిమాపై నమ్మకంతో రిలీజ్ కి రెండు రోజుల ముందే మేకర్స్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

రమేష్ (తిరువీర్) శ్రీకాకుళంలోని ఒక రూరల్ విలేజ్‌లో చిన్నసైజు ఫోటో స్టూడియోతో పాటు జిరాక్స్ సెంటర్ నడుపుతున్నాడు. మొహమాటం,బిడియం,భయం రమేష్ లో పోటాపోటీగా ఉంటాయి. తన షాప్ ఎదురుగా పంచాయితీ ఆఫీస్ లో పని చేసే హేమ(టీనా శ్రావ్య) అంటే రమేష్ కి చాలా ఇష్టం. మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన హేమకి కూడా రమేష్ అంటే ఇష్టం. కళ్లతోనే ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ ఒకరికొకరు ఆ విషయాన్నీచెప్పుకోరు. ఆనంద్( నరేంద్ర రవి) చిన్నసైజు పొలిటికల్ లీడర్‌తో పాటు మండల పరిషత్ అధ్యక్షుడికి కుడి భుజం. సౌందర్య( యామిని) తో ఆనంద్ కి పెళ్లి నిశ్చయమవుతుంది. పెళ్లి చూపుల్లోనే ప్రేమలో పడతారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ వీడియో చూడటానికి రమేష్ ని సంప్రదిస్తారు. రమేష్ మాత్రం ఆ పెళ్లి చెడకొట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ ఆనంద్ ని, నీప్రేమలో పడేలా చెయ్యమని హేమని కోరతాడు.హేమ కూడా ఒప్పుకుంటుంది. రమేష్ ఎందుకు ఆనంద్, సౌందర్యల పెళ్లి చెడగొట్టాలని అనుకున్నాడు? అందుకు కారణం ఏంటి? హేమని ఉపయోగించుకొని పెళ్లి చెడగొట్టడంలో సక్సెస్ అయ్యాడా ? అసలు ప్రీ వెడ్డింగ్ వీడియో తీసాడా? రమేష్,హేమ ప్రేమ ఏమైంది? ఆనంద్, సౌందర్యల పెళ్లి ఏమైంది? అనేదే చిత్ర కథ


ఎనాలసిస్

ముమ్మాటికీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిన్న సినిమాని తెరకెక్కించాలంటే వాళ్లకి ఇన్ స్పైర్ ఇస్తుందని చెప్పవచ్చు. చిత్ర కథ కూడా చాలా నేచురల్ గా ఉంది. కానీ కథనాల విషయంలో మరింత లోతుగా వెళ్ళలేదు. ఆ అవకాశం ఉన్నా కూడా మేకర్స్ ఆ దిశగా ఆలోచించలేదు. తూ తూ మంత్రంగా డైలాగ్స్ తో ముగించేశారు. కాకపోతే మూవీ అయితే బోర్ అనేది రాదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే రమేష్,హేమ మధ్య సన్నివేశాలతో పాటు, అసిస్టెంట్ రోషన్ సన్నివేశాలతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆనంద్ క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ బాగుంది. ఆనంద్, సౌందర్య తో వచ్చిన సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ సన్నివేశాలు కూడా సూపర్ గా వచ్చి నవ్వులని పూయిస్తాయి. ప్రీ వెడ్డింగ్ లో జరిగిన ఒక మిస్టేక్ తో ఆ ఇద్దరి పెళ్లిని రమేష్ ఆపాలని అనుకోవడం బాగుంది. కానీ అందుకు సంబంధించిన ప్రయత్నాలు సినిమా టిక్ గా లేవు. డాక్యుమెంటరీ సీన్స్ లాగా సాగాయి. ఆనంద్ ని ప్రేమలోకి దించమని హేమకి చెప్పాడు కాబట్టి, హేమ ప్రేమలోకి ఆనంద్ నిదానంగా వస్తున్నాడని చెప్పి ఎంటర్ టైన్ మెంట్ కోణంలో కన్ఫ్యూజన్ డ్రామాని క్రియేట్ చేసింది. ఆ విధంగా చేస్తే సరికొత్త లుక్ వచ్చి ఉండేది. వెల్ ట్విస్ట్ తో పాటు మిగిలిన ట్విస్ట్ ల విషయంలో సక్సెస్ అయ్యారు. రమేష్ లో ఉన్న మంచి తనాన్ని, అమాయకత్వాన్ని,భయాన్ని కొన్ని సీన్స్ ద్వారా చెప్పుండాల్సి వచ్చింది. ఆ విధంగా చేసి ఉంటే రమేష్ అనుకున్న నిర్ణయానికి మరింత జస్టిఫై వచ్చి ఉండేది. సెకండ్ హాఫ్ లో అయినా కథనం విషయంలో మరింత లోతుగా వెళ్తారేమో అనుకుంటాం. కానీ సాదా సీదాగానే ముగించేశారు. రమేష్, హేమ లవ్ ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు, ఆనంద్ ఫ్యామిలీ మధ్య ఎంటర్ టైన్ మెంట్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చెయ్యాలి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగా ఉన్నాయి.

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు

రమేష్ క్యారక్టర్ లో ‘తిరువీర్'(Thiruveer)పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. ఆ క్యారక్టర్ తన కోసమే పుట్టిందా అనేలా తన క్యారక్టర్ కి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసాడు. కాకపోతే నటనలో భిన్న పార్శ్యాలని ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. హేమ క్యారక్టర్ లో టీనా శ్రావ్య(టీనా శ్రావ్య)తన పాత్ర పరిధి మేరకు ఎక్కువ డోస్ లేకుండా ఎంత వరకు పెర్ ఫార్మ్ ని ప్రదర్శించాలో అంతవరకు ప్రదర్శించింది. నరేంద్ర రవి, యామిని కూడా తమ నటనతో మెస్మరైజ్ చేసారు. ముఖ్యంగా నరేంద్ర రవి అయితే శ్రీకాకుళం ప్రాంతంలోని ప్రజల్లో ఉండే కల్లా కపటం లేని మంచితనం, అమాయకత్వం, చిరు కోపాన్ని పర్ఫెక్ట్ గా ప్రదర్శించాడు. రమేష్ అసిస్టెంట్ గా చేసిన మాస్టర్ రోషన్ మరోసారి విజృంభించాడు. ఇతర క్యారెక్టర్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. టెక్నికల్ పరంగా చూసుకుంటే ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శ్రీకాకుళం ఏరియాకి చెందిన ప్రకృతి అందాలని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. రాహుల్ శ్రీనివాస్(రాహుల్ శ్రీనివాస్)దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కానీ రచయితగా పెద్దగా మెప్పించలేక పోయాడు. నిర్మాణ విలువలు అంతగా బాగోలేదు.

ఫైనల్ గా చెప్పాలంటే నటినటులు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ మెంట్ కోణంలో కథనం సాగింది.

రేటింగ్ 2 .75/5

అరుణాచలం

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird