
నవంబర్ 3, 2025 10:30AMన పోస్ట్ చేయబడింది

దైవంతో సమానంగా భావించే పరిస్థితి నుంచి కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. అందులో మహిళా టీచర్లు ప్రమేయం ఉండటం బాధాకరమైన విషయం ఇప్పుడు సమాజం ఇలాంటి ఉపాధ్యాయుల గురించి ఆందోళన వ్యక్తం చేసింది విశాఖలోని సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్న సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేని సాయి తేజ ఎందుకు అకాల మరణం చెందారనే విషయంపై విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే అతని స్నేహితులు ఇచ్చిన సమాచారంతో మొబైల్ డేటాను పరిశీలించారు, అందులో ఊహించని నమ్మలేని నిజాలు కనిపించాయి. ఆ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు సాయి తేజ తో విభిన్నంగా చాటింగ్ చేశారు.
అందులో ఒకరు సన్నిహితం అవ్వాలన్న ప్రయత్నం చేస్తే మరొకరు పరిశీలించి బ్లాక్‌మెయిలింగ్ చేశారు. అలా ఇద్దరు టీచర్ల విభిన్న ఒత్తిడితో సాయి తేజ మానసికంగా దిగులు చెందాడు. అందుకే అతను ప్రాణం తీసుకున్నాడాని కుటుంబ సభ్యులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎంపీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళ టీచర్లను వెంటనే అరెస్ట్ చేశారు సాయి తేజ కుటుంబ సభ్యులు ఇద్దరు కాలేజీ భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
ఈ విషయం ఇప్పుడు నెటిజన్లలో చర్చగా మారింది విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లు ఈ రకంగా ప్రేమ వ్యామోహంతో డిగ్రీ విద్యార్థిని మానసికంగా వేధించడం సరికాదంటున్నారు. అయితే ఇలాంటివి కొన్ని సందర్భాల్లో బయటికి వచ్చినప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు ఆపోజిట్ సెక్స్ విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పురుష టీచర్లు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చాలా సందర్భాలలో బయటకు వచ్చింది కానీ ఇప్పుడు విశాఖలోని సమతా కాలేజ్ వ్యవహారంలో మహిళ టీచర్ల తప్పుడు ప్రవర్తన గాడి తప్పిన సమాజానికి ఒక చిరునామాగా చెప్పుకుంటున్నారు.
