
నవంబర్ 2, 2025 10:15AMన పోస్ట్ చేయబడింది

కల్తీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం సిట్ అధికారులు భారీ పోలీసు బలగాలతో చేరుకొని, ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ముందుగా జోగి రమేశ్ అనుచరుడైన రాను విచారణకు తీసుకున్న అధికారులు, అనంతరం హైడ్రామా జోగి రమేశ్‌ను అరెస్టు చేశారు.
ఈ విషయం వెంటనే తెలిసి ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున ఇంటి వద్దకు చేరుకున్నారు. వారికి అభివాదం చేస్తూ జోగి రమేశ్ పోలీసు వాహనంలోకి ఎక్కారు.ముఖ్య నిందితుడు అద్దేపల్లి జనార్థనరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జోగి రమేశ్ అరెస్టు చేసినట్లు సమాచారం. జనార్థనరావు విచారణలో జోగి రమేశ్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని వెల్లడించారు.
ఈ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని సిట్ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. అయితే జనార్ధనరావుతో జోగి రమేష్ ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు వాస్తవాలు సిట్ అధికారులకు వెల్లడించడంతో జోగి రమేష్‌కు ఉచ్చు బిగుసుకుంది. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన గతంలోనే స్పష్టం చేశారు.
