
నవంబర్ 1, 2025 4:27PMన పోస్ట్ చేయబడింది

కర్నూలు జిల్లా సుంకేసులలో ఉన్న తుంగభద్ర బ్యారేజీలో భారీ లీకేజీ సంభవించింది. 12వ గేట్ వద్ద భారీగా నీరు లీకవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనివల్ల తుంగభద్ర నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. స్థానిక ప్రజల్లో ఆందోళన ఉంది. బ్యారేజీ నుండి భారీగా నీరు విడుదల కావడం, పరిసర గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎవరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
భారతదేశంలోనే పురాతనమైన ఈ సుంకేసుల బ్యారేజీ 1858లో నిర్మాణం ప్రారంభమై 1861లో పూర్తయింది. మొత్తం 30 గేట్లు కలిగిన ఈ బ్యారేజీలో 12వ గేట్ వద్ద ప్రస్తుతం లీకేజీ నమోదైంది. ఇంజినీరింగ్ బృందం అత్యవసర పనులు చేపట్టారు.మట్టం పెరుగుతున్న నేపథ్యంలో, అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలించడానికి అవసరమైతే అదనపు నీటి విడుదల కార్యక్రమం జరిగింది.
