
పోస్ట్ చేయబడింది అక్టోబర్ 31, 2025 3:31PM

ఏపీలో ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్‌తో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. వెంటనే రూ.250 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. నవంబర్ చివరికల్లా మొత్తం బకాయిలు ఒకే వాయిదాలో చెల్లిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన విరమించాయి.
బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో గత 20 రోజులుగా ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాథమికంగా రూ.250 కోట్ల బకాయిలు విడుదల చేసింది. దశల వారీగా మిగిలిన బకాయిలూ చెల్లిస్తామని ప్రకటించారు.
అయినా సమ్మె కొనసాగడంతో మొత్తం బకాయిలు వన్ టైం సెటిల్మెంట్ కింద నవంబర్ చివరికల్లా చెల్లించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. ఆస్పత్రుల యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగుతున్నట్లు ప్రకటన విడుదలైంది.
