
అక్టోబర్ 31, 2025 6:24PMన పోస్ట్ చేయబడింది

అనకాపల్లి జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హోం మంత్రి వంగలపూడి అనిత ఉపయోగించారు. వరద భాదితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. శుక్రవారం పాయకరావుపేట నియోజకవర్గం యస్. రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్ళి, ప్రజల యోగక్షేమాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. తుఫాను బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన నిత్యవసర వస్తువులు పంపిణీ చేసారు. బంగారమ్మపాలెం గ్రామంలో బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ పూరిళ్ళు మరియు ఐదు సంవత్సరాల క్రితం సముద్ర ప్రమాదంలో భర్త చేసిన మైలిపల్లి సత్తియ్యమ్మ పరిస్థితి చూసి చలించిపోయిన మంత్రి అనిత సొంత నిధులతో ఆర్థిక సహాయం అందజేసారు.
బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ, మైలిపల్లి సత్తియ్యమ్మలకు తక్షణమే పక్కా గృహాలు అప్పగించారు. ఎన్.ఇ.ఒ.బి. ప్రహారీ గోడ వలన ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలుపగా ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులను హోం మంత్రి పర్యవేక్షణ.
ఈ సందర్బంగా హోం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తుఫాన్ నేపథ్యంలో నిరంతరం అప్రమత్తం చేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్దం చేయడంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని తెలిపారు. 15 రోజుల్లో బంగారమ్మపాలెం గ్రామంలో రోడ్డు వేయడం జరుగుతుందని, మత్స్యకారుల గ్రామాల్లో మత్స్యకారులతో పాటు కులాల వారికి కూడా తుఫాను ప్రభుత్వ సహాయం అందజేస్తామని తెలిపారు.
గ్రామంలో సోలార్ ఫ్యానల్ ద్వారా చేపలు ఎండబెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, డ్వాక్రా మహిళలతో ఫైలట్ ప్రాజెక్ట్ గా సోలార్ ఫ్యానల్ ద్వారా చేపల ఎండబెట్టే ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్ళకు తక్షణమే పక్క గృహాలకు ఆదేశాలు జారీచేయడం జరుగుతాయి. బంగారమ్మపాలెం గ్రామంలో ఉన్న చిన్న,చిన్న సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
