
అక్టోబర్ 30, 2025 10:53AMన పోస్ట్ చేయబడింది

ఇకపై మొబైల్ ఫోన్లలో ట్రూకాలర్ యాప్ అవసరం లేదు. ఎందుకంటే.. ఇన్‌కమింగ్ కాల్స్‌కు మొబైల్ స్క్రీన్‌లపై ఫోన్ చేసిన వ్యక్తి పేరు కనిపిస్తుంది. ఈ సౌలభ్యం వచ్చే ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టెలికాం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇన్నాళ్లూ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వస్తే కేవలం నంబర్ మాత్రమే కనిపిస్తుంది. కాల్ చేసిన వ్యక్తి పేరు కోసం ట్రూకాలర్ వంటి యాప్స్‌ను ఉపయోగించాల్సి వస్తుంది.
అయితే వచ్చే ఏడాది మార్చి నుంచి ఇక ఆ అవసరం లేదు. ముందుగా ప్రయోగాత్మకంగా ఒక్కో సర్కిల్‌లో ఈ సౌకర్యానికి అందుబాటులోకి తీసుకువస్తున్న టెలికాం సంస్థలు వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సౌలభ్యాన్ని దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ నేరాలను అరికట్టడం, మోసపూరిత కాల్‌లను నియంత్రించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను తీసుకురావాలని టెలికాం సంస్థ చేసిన ప్రతిపాదనకు ట్రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫోన్ కనెక్షన్ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని పేరు కనిపించేలా చేయడానికి ట్రాయ్ అంగీకరించింది.
