
అక్టోబర్ 30, 2025 11:28AMన పోస్ట్ చేయబడింది
.webp)
రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి రైతులకు సంబంధించి ప్లాట్ల కే టాయింపు, పూర్తి గృహాలను నాలుగు నెలల్లో నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చిందంటే ఆయన వచ్చే నాలుగు నెలల్లో మిగిలిన వారికి కూడా ప్లాట్ల కేటాయింపు, కేటాయింపులను పూర్తి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో దుష్ర్పచారం వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రెజిస్ట్రేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారనీ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొంతమంది పోస్టులు పెడుతున్నారనీ, వాటిని నమ్మవద్దని అన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించిన విషయం తెలిపిందే. పూలింగ్ ప్రక్రియ ద్వారా 30,635 మంది రైతుల నుంచి సమీకరించిన 34,911.23 ఎకరాల భూమికి సంబంధించి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాల్సి ఉన్న సంగతి విధితమే. ఇప్పటి వరకు 29,644 మంది రైతులు ఇచ్చిన 34,192.19 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని మంత్రి నారాయణ వివరించారు. మిగిలిన వారికి కూడా నాలుగు నెలలలోపు ప్లాట్ల కేటాయింపు, గృహనిర్మాణ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.