
అక్టోబర్ 25, 2025 2:52PMన పోస్ట్ చేయబడింది

కర్నూలు సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ఫిట్ నెస్, డ్రైవర్ల నైపుణ్యంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా తాజాగా మరో రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. శనివారం (అక్టోబర్ 25)తెల్లవారు జామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జీపీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు, ముందు భాగం ధ్వంసమయ్యాయి. అదృష్ట వశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇకమరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తాపడింది. ఈ సంఘటన శనివారం (అక్టోబర్ 26) ఉదయం జరిగింది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యు గో ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.