
అక్టోబర్ 18, 2025 9:23PMన పోస్ట్ చేయబడింది

తెలంగాణలో మద్యం షాపులకు రోజుకి దరఖాస్తుల వెల్లువ కొనసాగుతుంది. శనివారం చివరి రోజు కావడంతో సాయంత్రం నుంచి గంట గంటకు దర ఖాస్తులు పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం నాటికి 2620 మద్యం షాపులకు 50 వేల దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు దరఖాస్తులు 30 వేల నుంచి 40 వేల వరకు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
గత సంవత్సరం నుండి ఈ ఏడాది ఆదాయం తగ్గినప్పటికి పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనాలు వేసుకుంటున్నాయి.సెప్టెంబర్ 27 నుంచి మొదలైన దరఖాస్తులు స్వీకరణ ప్రారంభంలోనే కొడిగా కొనసాగుతున్నాయి. కానీ మూడు రోజులుగా ముందస్తుగా అనుకున్న రీతిలో దరఖాస్తులు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. శనివారం రాత్రి వరకు గ్రాండ్ టోటల్గా 80 వేల నుంచి 90 వేలకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాయంత్రం 5 గంటల లోపు వచ్చిన వారికి కన్లు వేసి దరఖాస్తులను తీసుకుంటారు. ఏపీకి చెందిన ఓ మహిళ ఏకంగా 150 మద్యం తాగడానికి దరఖాస్తు చేసింది. రూ.4 కోట్ల 50 లక్షలు చెల్లించింది. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ దరఖాస్తుల స్వీకరణ. గత ఏడాది నుంచి దరఖాస్తులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.