
అక్టోబర్ 18, 2025 12:41PMన పోస్ట్ చేయబడింది
.webp)
బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం (అక్టోబర్ 18) జరుగుతున్న తెలంగాణ బంద్ ప్రశాంతంగా. అన్ని రాజకీయ పార్టీలూ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా బంద్‌లో పాల్గొన్నారు. ఇక బంద్ సందర్భంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంద్ లో ప్రత్యక్షంగా సాగింది. ఆమె తన నివాసం నుంచి ఆటోలో ఖైరతాబాద్ చౌరస్తా వరకూ వచ్చి అక్కడ రోడ్డుపై బైఠాయించారు.
ఇక అంబర్ పేటలో బంద్ సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహనుమంతరావు జారి పడ్డారు. బంద్ సందర్భంగా జరిగిన ర్యాలీలో వీహెచ్ ఫెక్సీ పట్టుకుని నడుస్తుండగా అంబర్ పేట వద్ద అదుపు తప్పి పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనను లేవదీసి సపర్యలు చేశారు. అనంతరం ఆయన యథావిధిగా ర్యాలీలో పాల్గొన్నారు.
