2


అక్టోబర్ 17, 2025 4:17PMన పోస్ట్ చేయబడింది

బీసీ సంఘాలు శనివారం నిర్వహించతలపెట్టిన తెలంగాణ బంద్ శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు కానీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు గానీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు పర్యవేక్షించబడ్డాయి. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలు ఎదురవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
