
అక్టోబర్ 17, 2025 1:02AMన పోస్ట్ చేయబడింది
.webp)
హైదరాబాద్ శివారు ప్రాంతం మంచాల లో రేవంత్ పార్టీ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంచాల శివారు ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీని ఓ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో గుర్తించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన కీలక నేతల కోసం ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ పోలీసులు దాడి చేసి రేవంత్ పార్టీని భగ్నం చేశారు. పలువురు పొలిటికల్ లీడర్లు అమ్మాయిలతో డ్యాన్సు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
అలా దొరికిన వారిలో బీఆర్ఎస్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ సోదరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సందర్బంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్టీకర్ ఉన్న ఓకారను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
