
డిసెంబర్ 29, 2025 2:12PMన పోస్ట్ చేయబడింది

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో టికెట్లు జారీ చేసింది. మూడు రోజుల పాటు టికెట్లు లేని భక్తులకు దర్శనం ఉండదు. 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇప్పటికే టిక్కెట్లు పొందిన భక్తులకు మూడు దశల్లో దర్శనానికి అనుమతి ఉంటుంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ఏకాదశికి అలంకరణలు పూర్తి అయ్యాయి.
స్వామి వారి ఆలయంతో పాటు ఆలయం బయట భారీ శెట్టుతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అలంకరణలు కట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇవాళ అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రతి చోటా టెక్నాలజీని వాడుకుంటున్నామని ఏఐ కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తుల దర్శనం, వెయిటింగ్, వాహనాల పార్కింగ్ సహా రిజిస్ట్రేషన్ మానిటర్ చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లడ్డూల కౌంటర్లు కూడా పెంచమని చెప్పారు.
