
డిసెంబర్ 27, 2025 6:25PMన పోస్ట్ చేయబడింది

స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం శుక్రవారం తెలిసిన సమాచారమందుకున్న బద్వేలు అర్బన్ పోలీసులు అర్ధరాత్రి స్పాన్ సెంటర్ పై దాడి చేసి ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని నెల్లూరు రోడ్ బైపాస్ సర్కిల్ వద్ద గత ఏడాదిగా స్పా సెంటర్ ఉన్నారు.
స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు బద్వేలు అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలసి అర్ధరాత్రి తర్వాత స్పాసెంటర్పై దాడి చేసి, అక్కడవున్న ఇద్దరు యువకులతో పాటు, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కాగాపోలీసులు అదుపులోకి తీసుకున్న యువ’తుల’ను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ నుంచి యువతులను బద్వేల్‌కు రప్పించి నాలుగు నెలలుగా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు గుర్తించారు. పట్టణ నిర్వాహకులపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
