
డిసెంబర్ 22, 2025 1:24PMన పోస్ట్ చేయబడింది

అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా ఆనందంగా ఉంటుంది. పైగా ఇది ఆహారాన్ని ఎక్కువసేపు వేడిగా ఉంచుతుంది. కాకుండా ఆహారాన్ని వేడి చేయడానికి కూడా దీన్ని ఉపయోగించాలి. ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, వంట చేయడానికి, ఆహారాన్ని తిరిగి వేడి చేయడానికి ఇలా చాలా రకాలుగా సిల్వర్ పాయిల్ వాడతారు. అయితే ఇన్ని రకాలుగా ఉపయోగించే సిల్వర్ ఫాయిల్ ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుందని తెలుసా? అందరూ సిల్వర్ ఫాయిల్ వల్ల ఎన్ని ఉపయోగాలో అనుకుంటారు. కానీ సిల్వర్ పాయిల్ ను వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అసలు సిల్వర్ ఫాయిల్ ను ఎందుకు వాడకూడదు? సిల్వర్ ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే..
అల్యూమినియం ఫాయిల్ ఎందుకు ప్రమాదం..
అల్యూమినియం ఫాయిల్‌లో వేడి ఆహారం లేదా నిమ్మకాయ, టమోటా లేదా స్పైసీ సాస్ వంటి ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలను ప్యాక్ చేసినప్పుడు మైక్రోస్కోపిక్ అల్యూమినియం కణాల ఆహారంలోకి విడుదల అవుతాయి. ఆమ్ల గుణం ఉన్న పదార్ధాలు వాడినప్పుడు ఇలా విడుదల అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. దీని వల్ల అల్యూమినియం శరీరంలోకి ప్రవేశిస్తుంది. సాధారణ స్థాయిల కంటే ఎక్కువ అల్యూమినియం ఉన్నప్పుడు శరీరంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
అల్యూమినియం ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలు..
మెదడు, నాడీ వ్యవస్థ..
అల్యూమినియం ఒక న్యూరోటాక్సిన్. అంటే ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అల్యూమినియం అధిక స్థాయిలో ఉండటం వల్ల మెదడుపై ప్రభావం పడుతుంది. మెదడులో అల్యూమినియం పేరుకుపోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధులు ప్రమాదం పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎముకలు, కండరాలు..
అల్యూమినియం అధికంగా చేరడం వల్ల కాల్షియం, ఫాస్ఫేట్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది ఎముక సాంద్రత తగ్గడానికి. ఇది ఎముక బలహీనతకు. సాధారణ ప్రాథమిక విధి శరీరం నుండి అదనపు అల్యూమినియంను తొలగించడం. కానీ అధిక అల్యూమినియం పనితీరును దెబ్బతీస్తుంది.
వేడి, ఆమ్ల ఆహారం..
అల్యూమినియం లీచింగ్ అనేది ఉష్ణోగ్రత, ఆహారం స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నిమ్మకాయ, టమోటా, వెనిగర్ వంటి వేడి ఆహారం లేదా ఆమ్ల ఆహారాలను ఫాయిల్‌లో ప్యాక్ చేసినప్పుడు అల్యూమినియం కణాల ఆహారంలోకి వేగంగా లీచింగ్ అవుతాయి. వంట కోసం ఫాయిల్ ఉపయోగించినప్పుడు కూడా ఈ లీచింగ్ తీవ్రమవుతుంది.
ప్రత్యామ్నాయాలు..
అల్యూమినియం ఫాయిల్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా గాజు, సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌కన్‌టార్‌లను ఉపయోగించాలి. ఫాయిల్ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే, చల్లని, పొడి ఆహారాన్ని మాత్రమే ప్యాక్ చేయడం మంచిది. ఆమ్ల ఆహారాలను అల్యూమినియం ఫాయిల్ తో డైరెక్ట్ గా టచ్ చేయకూడదు. మరీ ముఖ్యంగా ఎల్లప్పుడూ ఫుడ్-గ్రేడ్ బటర్ పేపర్‌ను ఉపయోగించాలి. ఆ తరువాత దాన్ని సిల్వర్ పాయిల్ లో ప్యాక్ చేయాలి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించబడ్డాయి. వారి ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు…
