
డిసెంబర్ 18, 2025 2:08PMన పోస్ట్ చేయబడింది
.webp)
కేంద్ర ప్రభుత్వం మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ఈ పథకం పేరుమార్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజల ఆకలితో అలమటించేలా చేస్తోందని తెలిపారు. ఉపాధి హామీ ఇప్పటికే ఆచరణలో బలహీనపరిచిన ప్రభుత్వం, ఇప్పుడు దాని ఉనికినే దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
