
డిసెంబర్ 14, 2025 2:01PMన పోస్ట్ చేయబడింది

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిల మధ్య ఉప్పల్ స్టేడియంలో శనివారం (డిసెంబర్ 13) జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ ఫుట్బాల్ అభిమానులకు మధురానుభూతిని అందించింది. ఈ ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిల మధ్య ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్లో జరిగిన విషయం తెలిసిందే. మా ఆహ్వానాన్ని మన్నించి, మా హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు GOAT లియోనెల్ మెస్సి, ఫుట్బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డిపాల్లకు హృదయపూర్వక ధన్యవాదాలు అని రేవంత్.. మాతో చేరి శనివారం సాయంత్రం జీవితకాల జ్ఞాపకార్థం మార్చుకున్నందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ అంటే క్రీడలు, శ్రేష్ఠత, ఆతిథ్యం అని ప్రపంచానికి చాటామన్నారు. నగరం అంతటా విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బందికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం తరపున, మా అతిథులు, క్రీడా ప్రేమికులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు, సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం పర్యటన బిజీ ఉంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఆదివారం (14న) ఢిల్లీలో మహార్యాలీ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొననున్నారు .
