Home Latest News తెలంగాణ పోలీసులకు మెస్సీ బృందం అభినందనలు | అంతర్జాతీయ స్థాయి భద్రతా ఏర్పాట్లు| మెస్సీ| మేనేజర్| భద్రత| ప్రశంసలు| తెలంగాణ – ACPS NEWS

తెలంగాణ పోలీసులకు మెస్సీ బృందం అభినందనలు | అంతర్జాతీయ స్థాయి భద్రతా ఏర్పాట్లు| మెస్సీ| మేనేజర్| భద్రత| ప్రశంసలు| తెలంగాణ – ACPS NEWS

by Admin_swen
0 comments
తెలంగాణ పోలీసులకు మెస్సీ బృందం అభినందనలు | అంతర్జాతీయ స్థాయి భద్రతా ఏర్పాట్లు| మెస్సీ| మేనేజర్| భద్రత| ప్రశంసలు| తెలంగాణ

డిసెంబర్ 14, 2025 5:54AMన పోస్ట్ చేయబడింది


హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లపై ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మేనేజర్, ఆయన భద్రతా బృందం కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భం గా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్‌రెడ్డి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబులను ప్రత్యేకంగా అభినందించారు. మ్యాచ్ అనంతరం, మెస్సీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జా తీయ స్థాయిలో జరిగిన ఈ హైప్రొఫైల్ క్రీడాకారుడు భద్రతా చర్యలను అద్భుతంగా కనుగొన్నారు. స్టేడియం లోపల బయట కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వేలాది మంది ప్రేక్షకుల రాకపోకలను సజావుగా నిర్వహించడం ప్రశంసనీయమని.

ముఖ్య అతిథులు, మెస్సీ బృందం రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా తీసుకున్న జాగ్రత్తలు తమను ఎంతగానో ఆకట్టుకున్నా యని మెస్సీ మేనేజర్‌ పేర్కొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చినా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో మ్యాచ్‌ ముగియడం పోలీసుల ప్రొఫెషనల్ ఎఫిషియెన్సీకి నిదర్శనమని పొగడ్తల వర్షం కురిపించారు. మెస్సీ, ఆయన బృందానికి సేవలు కల్పించిన ఎస్కార్ట్, భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్నాయి. మెస్సీ బృందం నుంచి వచ్చిన ఈ అభినందనలు రాష్ట్ర పోలీసు శాఖకు గర్వకారణంగా నిలవడమే కాకుండా, వారి సామర్థ్యానికి గుర్తింపుగా మారాయని పోలీసు అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, పోలీసు అధికారులు, సిబ్బంది రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి అభినందించారు.
ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ సందర్భంగా చిన్న లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా విజయవంతంగా ముగిసేలా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారని డీజీపీ ప్రశంసించారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ బి. శివధర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మెస్సీ నేపథ్యంలో భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

శనివారం (డిసెంబర్ 13) ఉదయం కోల్‌కతాలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తమై, అక్కడ చోటుచేసుకున్న లోపాలను నివేదన, ఉప్పల్ స్టేడియంలో భద్రతపై కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. అభిమానులు ఎవరూ గ్రౌండ్‌లోకి ప్రవేశించకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు.మ్యాచ్ ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడంలో కరించిన ఫుట్‌బాల్ క్రీడాభిమానులు, మెస్సీ అభిమానులకు డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird