Home Latest News వయసు రాగానే పెళ్లి చేసుకోవడం కాదు.. పెళ్లికి ఈ లక్షణాలు ఉండాలి మరి..! | పెళ్లికి ముందు మీకు కావాల్సిన క్వాలిటీస్| పెళ్లి చేసుకోవడానికి ఉండాల్సిన లక్షణాలు ఇవే| ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిలో మీరు తప్పక చూడవలసిన అద్భుతమైన లక్షణాలు – ACPS NEWS

వయసు రాగానే పెళ్లి చేసుకోవడం కాదు.. పెళ్లికి ఈ లక్షణాలు ఉండాలి మరి..! | పెళ్లికి ముందు మీకు కావాల్సిన క్వాలిటీస్| పెళ్లి చేసుకోవడానికి ఉండాల్సిన లక్షణాలు ఇవే| ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిలో మీరు తప్పక చూడవలసిన అద్భుతమైన లక్షణాలు – ACPS NEWS

by Admin_swen
0 comments
వయసు రాగానే పెళ్లి చేసుకోవడం కాదు.. పెళ్లికి ఈ లక్షణాలు ఉండాలి మరి..! | పెళ్లికి ముందు మీకు కావాల్సిన క్వాలిటీస్| పెళ్లి చేసుకోవడానికి ఉండాల్సిన లక్షణాలు ఇవే| ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిలో మీరు తప్పక చూడవలసిన అద్భుతమైన లక్షణాలు

డిసెంబర్ 9, 2025 2:47PMన పోస్ట్ చేయబడింది


పెళ్లి ప్రపంచంలో అందరూ సాగించే ఒక పవిత్రమైన బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు. దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తారు. కానీ చాలా బంధాలు విచ్చిన్నం అవ్వడానికి, వివాహం నిలబడకపోవడానికి కారణం వారి ఆలోచనలే అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. కేవలం వయసు చూసి పెళ్లి చేయడం సరికాదని, కొన్ని లక్షణాలు వచ్చాకే పెళ్లి చేయాలని అంటున్నారు. ఈ లక్షణాలు ఉంటే ఇక పెళ్లి అయితే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదట. వయసు కాకుండా పెళ్లి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి? తెలుసుకుంటే..


నేను కాదు మనం..

పెళ్లి అంటే కేవలం ఇంకొక వ్యక్తితో కలిసి జీవించడం మాత్రమే కాదు, అది జీవితాన్ని వేరొకరితో పంచుకోవడం. పెళ్లి చేసుకోవడాన్ని కేవలం స్వంత ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా వచ్చే భాగస్వామి, వారి కుటుంబాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. పెళ్లి చేసుకోవడం అంటే ప్రతిది తనకు నచ్చినట్టు, తను కోరుకుంటున్నట్టు ఉండేది కాదు.. అందరికీ నచ్చినట్టు, అందరూ కలిసి ఉండేలా ఉండాలి. చేతిలో ఒక్క పండు ఉన్నా దాన్ని ఒక్కరే కాకుండా అందరూ కలిసి పంచుకుని తినాలి అంటే మనస్తత్వం ఉండాలి. ఇలా ఉంటే పెళ్లికి ఒక లక్షణం ఉన్నట్టే.

సమస్యలు, పరిష్కారాలు..

వివాహం అయ్యాక భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా వస్తాయి. కానీ చాలామంది వాటిని పరిష్కరించడంలో విఫలం అవుతారు. భార్యాభర్తల మధ్య సమస్య లేదా గొడవ వస్తే కోపంతో దాన్ని పెంచుకోవడానికి బదులు దాన్ని ఎలా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనేది తెలిసి ఉండాలి. సాధారణంగా సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు కలిగి ఉంటే వివాహ బంధంలో కూడా అది చేయగలుగుతారు. తప్పు చేసినప్పుడు ఒప్పుకునే స్వభావం కూడా ఉండాలి. అలాగే ఎదుటివారు తప్పు చేసినప్పుడు దాన్ని క్షమించగలిగే మనసు ఉండాలి. ఇలా ఉంటే ఒక మంచి లైప్ పార్టనర్ అవుతారు.

వాస్తవ జీవితం..

చిన్నతనం కొన్ని కలలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమాలు, టీవీలు, పుస్తకాల ప్రబావం వల్ల భాగస్వామి గురించి, వివాహం తర్వాత జీవితం గురించి చాలా డ్రీమ్స్ పెట్టుకుంటారు. కానీ నిజానికి వివాహం తర్వాత జీవితంలో కలలను వెతకకూడదు. వాస్తవిక జీవితంలోనే బ్రతకాలి. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా ఉండరు. అలాగే జీవితంలోకి వచ్చే వ్యక్తి గురించి చాలా ఆశలు, అంచనాలు పెట్టుకోకూడదు. వాస్తవాన్ని, వ్యక్తి ఎలా ఉంటారో దాన్నే అంగీకరించాలి. యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఈ లక్షణం ఉంటే జీవితంలో అసంతృప్తి ఫీలవడం చాలా తక్కువ. మంచి భాగస్వామి కాగలుగుతారు.

ఆర్థిక బాధ్యతలు..

వివాహానికి ముందు వివాహం తర్వాత ఆర్థిక విషయాలలో చాలా మార్పులు వస్తాయి. ఒక్కసారిగా భార్యాభర్తల ఇద్దరి మీద బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు ఎలా చేయాలి? దుబారా ఎలా తగ్గించాలి? భవిష్యత్తు కోసం పొదుపు ఎలా చేయాలి? ఆలోచించండి, వీటిని ఎలా నిర్వహించాలి అనే విషయం తెలిసిన వారు అయితే కుటుంబాన్ని పోషించే క్వాలిటీ ఉంటే ఇవన్నీ పెళ్లి చేసుకోవాలంటే ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

సంతోషం..

ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండగలగడం పెళ్లికి సిద్దంగా ఉండే గొప్ప లక్షణం. ఇది చాలామందికి వింతగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. ఏ వ్యక్తి అయినా తన సంతోషం ఇతరుల మీద ఆధారపడి ఉండకూడదు. పెళ్లి చేసుకోగానే ఇతరుల సంతోషమే చూడాలి అనుకోవడం చాలా తప్పు. ఎవ్వరూ లేకపోయినా తాను సంతోషంగా ఉండగలననే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో అయినా తనను తాను సంతోషంగా ఉంచుకునే వ్యక్తి ఇతరులను సంతోష పెట్టడంలో ఎప్పుడూ విఫలం కారు.

కష్టాలు.. బాలెన్సింగ్..

ఒంటరిగా ఉన్నా, జంటగా ఉన్నా జీవితం ఎప్పుడూ సులువుగా ఉండదు. కాకపోతే జంటగా ఉన్నప్పుడు సవాళ్లు, సమస్యలు, కాస్త ఎక్కువ. అయితే అలాంటివి ఫేస్ చేయడానికి బంధంలో మరొకరు కూడా తోడుగా ఉంటారు. జీవితంలో వచ్చే వ్యక్తి అనారోగ్యంతో ఉన్నా, ఆర్థిక సమస్యలతో ఉన్నా, కుటుంబ సమస్యలతో ఉన్నా, పరిస్థితులు ఉన్నా సరే.. అన్ని సమయాల్లో ఓపికతో కలిసి ఉండే ధైర్యం, అన్నింటిని అధిగమించే నైపుణ్యం ఉండాలి. ఈ లక్షణం కూడా ఉంటే పెళ్లి వారికి ఎలాంటి అభ్యంతరం లేనట్టే..

పైన చెప్పుకున్న అన్నీ ఉన్నవారు పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ పైన చెప్పుకున్న లక్షణాలు లేకపోతే వయసు వచ్చినా సరే.. పెళ్లి అయితే మీరు కరెక్ట్ కాదని అర్థం. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీ వల్ల మీ లైఫ్ లోకి వచ్చే భాగస్వామి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితులలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు, విడిపోవడానికి దారితీసే గొడవలు కూడా రావచ్చు.

*రూపశ్రీ.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird