Home Latest News చెక్కు చెదరని స్నేహ బంధం! | రష్యా మరియు భారతదేశం స్నేహం కాల పరీక్షగా నిలిచింది| పుతిన్| భరత్ – ACPS NEWS

చెక్కు చెదరని స్నేహ బంధం! | రష్యా మరియు భారతదేశం స్నేహం కాల పరీక్షగా నిలిచింది| పుతిన్| భరత్ – ACPS NEWS

by Admin_swen
0 comments
చెక్కు చెదరని స్నేహ బంధం! | రష్యా మరియు భారతదేశం స్నేహం కాల పరీక్షగా నిలిచింది| పుతిన్| భరత్

డిసెంబర్ 8, 2025 5:16AMన పోస్ట్ చేయబడింది


పదవిలో ఉన్నవాళ్లు, మరీ ముఖ్యంగా దేశాధిపతులు ఏదైనా చేయగలరనడానికి తాజా ఉదాహరణ శుక్రవారం (డిసెంబర్ 5) భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన. సాక్షాత్తు రష్యా అధినేత బయలుదేరాడంటే “రాజు వెడలె,రవితేజములరరగా” అన్నట్లు వందిమాగధులు, రక్షకసముదాయం బయలుదేరుతారు ఆయన రక్షణకు ఐదంచల వ్యవస్థ ఉంటుంది.ఆయన ప్రయాణం విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా విమానం కూడా ఉంటుంది. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు లియాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు. ఆయన పండ్ల రసాలు,మాంసాహారం తీసుకుంటారు. భద్రతకు సంబంధించి ఇంతటి జాగ్రత్తలు అగ్రరాజ్యాధినేత తరువాత రష్యా అధ్యక్షుడి విషయంలోనే ఉంటాయి.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంపై ట్రాఫిక్ వార్ని ప్రకటించారు. .భారత్ వచ్చిన పుతిన్ భారత్,రష్య మధ్య చమురు ఒప్పందానికి ఎలాంటి విఘాతం కలగదని హామీ ఇచ్చారు.అలాగే మరో ఐదేళ్లపాటు అమలులో ఉండే ఆర్థిక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా 11 ఒప్పందాలు జరిగాయి. అలాగే రష్యా,భారత్ ఒప్పందాలపై చైనా హర్షం వ్యక్తం చేసింది. ఏకధృవ ప్రపంచంలో భారత్, రష్యా,చైనాల మైత్రి నిస్పందంగా అమెరికాకు కంటగింపు. .భారత్, చైనా,రష్యా ఒకటిగా ఉంటే అమెరికా జీరో అంటూ ఇప్పటికే చైనా వ్యాఖ్యానించింది కూడా. .గతంలో కూడా ఈ మూడు దేశాలు ఇదే మాట ట్రంప్ కు పరోక్షంగా ఎరుకపరిచిన విషయం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి.

1992లో సోవియట్ యూనియన్ పతనం అయ్యేవరకూ అమెరికాకు దీటుగా అన్ని విషయాల్లో రష్యా పోటీగా ఉండేది. ప్రచ్ఛన్న యు కాలంలో భారత్, రష్యాల మధ్య సహకారం ఉంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత కూడా భారత్, రష్యాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా యుద్ధ పరికరాల సరఫరా విషయంలో ఇరు దేశాల మధ్య బంధం చెక్కు చెదరలేదు. . ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పీచమణచడంలో రష్యా ఆయుధాలు కీలక పాత్ర పోషించాయి. రష్యా అధినేతగా వాద్లిమిర్ పుతిన్ పాతికేళ్లకు పైగా అప్రతిహతంగా కొనసా గుతున్నారు. సోవియట్ పతనం తదననంతరం.. ప్రపంచ దేశాలలో రష్యా ప్రాధాన్యత, ప్రాముఖ్యతను కొనసాగించడంలో ఆయన కీలకంగా వ్యవహరించడంలో సందేహం లేదు.

అన్ని రంగాల్లో అమెరికాకు దీటుగా రష్యాను నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. దౌత్య వ్యవహారాలలో కూడా కీలకంగా వ్యవహరించారు. భారత్ కు చిరకాల,సాంప్రదాయ మిత్రుడుగా దాదాపు ఏడు దశాబ్దాలుగా రష్యా ఉంది. పుతిన్,మోదీ భేటీ ఇదే తొలిసారి కాదు. వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ అప్పట్లో పుతిన్ తో భేటీ అయ్యారు.అప్పటి నుంచి వారి మైత్రి కొనసాగుతూనే ఉంది. భారత్, రష్యాల స్నేహ బంధం కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird