
2 డిసెంబర్ 2025 8:03PMన పోస్ట్ చేయబడింది
.webp)
హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న కుక్కకాటు ఘటనలు పెరుగుతున్నాయని రేబిస్ వ్యాధి ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసు కోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రేబిస్ వ్యాధి ప్రాణాంతకరమైనదని, కుక్కకాటు జరిగిన వెంటనే గాయం శుభ్రం చేయడమే కాకుండా ప్రి–ఎక్స్‌పోజర్ మరియు పోస్ట్-ఎక్స్‌పోజర్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో కుక్కకాటు కేసులకు ప్రత్యేక చికిత్స అందించినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ డా. రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది ఇప్పటివరకు కుక్క కాటు కేసుల సంఖ్య పెరిగింది. 2023లో 27,172 కుక్కకాటు కేసులు నమోదు కాగా, రేబిస్ కారణంగా 13 మంది మరణించారు. 2024లో కేసులు 29,054కు పెరిగి, రేబిస్‌తో 26 మరణాలు చోటుచేసుకున్నాయి.
2025లో (నవంబర్ వరకు) 31,488 కుక్కకాటు కేసులు నమోదు కాగా, రేబిస్ కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
కుక్కకాటు కేసుల్లో ప్రతి ఏడాది పెరుగుదల ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. రేబిస్ వ్యాధి ఒకసారి సోకితే ప్రాణాంతకమని, అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రజలు చేయగలిగిన ముఖ్యమైన చర్య అని ఆయన వివరించారు. కుక్కకాటు జరిగిన వెంటనే కనీస నిర్లక్ష్యమూ ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. ఒంటరిగా కనిపించే చిన్నపిల్లలు, మహిళలపై వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇలా నగరంలో కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ కుక్క కాటు కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని…. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేశారు…
