
డిసెంబర్ 1, 2025 8:02PMన పోస్ట్ చేయబడింది

కేరళ సీఎం పినరయి విజయన్‌కు మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్, ఈడీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం..
జారీ చేసిన ఈ నోటీసులో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిబంధనలను ఉల్లంఘిం చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, కేఐఐఎఫ్‌బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎం అబ్రహాం కూడా ఈ నోటీసులు అందుకున్నారు.
ఈడీ గత మూడేళ్లుగా ఈ కేసుపై దర్యాప్తు నిర్వహించి.. సెప్టెంబర్‌లో తన నివేదికను అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు సమర్పించింది. మసాలా బాండ్ల ద్వారా సేకరించిన నిధులను.. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ భూమి కొను గోలుకు ఉపయోగించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
కేరళ ప్రాథమికఐ నిధి బోర్డు (కేఐఎఫ్‌బీ) 2019 ఏప్రిల్‌లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో చేయడం ద్వారా మసాలా బాండ్ల రూపంలో రూ. 2,150 కోట్లు నిధులు సేకరించింది. ఈ బాండ్ల జారీపై ఈడీ 2021లో దర్యాప్తు ప్రారంభించబడింది.
అయితే ఈడీ నోటీసు అందినట్లు మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కూడా ధృవీకరించారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “ఇదంతా అనవసరం. మేము భూమి కొనుగోలు కోసం ఆ నిధులను ఎప్పుడూ ఉపయోగించలేదు. కేఐఐఎఫ్‌బీ ప్రాజెక్టుల కోసం భూసేకరణ నిబంధనలు జరిగాయి.
ఈడీ నోటీసు ఎన్నికల స్టంట్‌లో భాగమే” అని ఐజాక్ అన్నారు. కేఐఐఐ ఎఫ్‌బీ సీఈఓ అబ్రహాం ఈ నోటీసుపై స్పందించడానికి నిరాకరించారు.
