
డిసెంబర్ 1, 2025 9:50AMన పోస్ట్ చేయబడింది
.webp)
ఐ బొమ్మ రవిని పోలీసులు మళ్లీ కస్టడీకి తీసుకోనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తున్నది. తీవ్ర సంచలనం సృష్టించిన పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ పై సోమవారం (డిసెంబర్ 1)నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతుంది. అదే సమయంలో మరో మూడు కేసులలో పోలీసులు రవిని ఇదే కోర్టులో హాజరుపరచనున్నారు.
ఐబొమ్మ రవిని ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మూడు కోర్టులలో రవిని మరో కోర్టులో హాజరుపరచడం, ఆ మూడు కేసుల విచారణకు మరోమారు కస్టడీకి సమర్పించనున్న కోర్టును కోరిన కేసు. అందుకు కోర్టు అనుమతి ఇస్తే మరో మారు పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉందంటున్నారు న్యాయనిపుణులు.
