
నవంబర్ 15, 2025 11:58AMన పోస్ట్ చేయబడింది

గేమింగ్ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లపై కొరడా ఝుళిపిస్తున్న కోర్టులకూ హ్యాకింగ్ బెడద తప్పడం లేదు. తాజాగా తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు ఆ వెబ్ సైట్ లో ఏకంగా బెట్టింగ్ యాప్ ను తీసుకొచ్చారు. వివరాల్లోకి వెడితే.. తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. ఈ సందర్భంగా శనివారం పేర్కొన్నారు.
]కోర్టు ఆర్డర్లు డౌన్ లోడ్ చేస్తుండగా హైకోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైందన్న విషయం వెలుగు చూసింది. ఆ వెబ్‌సైట్‌లో బెట్టింగ్ యాప్ ప్రత్యక్షమైంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. హైకోర్టు వెబ్‌సైట్‌లోకి హ్యాకర్లు ఏలా యాక్సెస్ అయ్యారు.. సర్వర్‌లో ఇతర విషయాలపై విచారణ జరిగింది. మరో వైపు టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి సిస్టమ్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు
