
నవంబర్ 8, 2025 4:12PMన పోస్ట్ చేయబడింది

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు 2000 కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపోవడంతో అక్కడి ప్రజలు కోళ్ల కోసం ఎగబడ్డారు. రోడ్డంతా కోళ్లతో నిండిపోవడంతో ఆసక్తిగా వాటిని పట్టుకునే హడావుడి సాగింది.
డీసీఎం వ్యాన్‌లో వచ్చిన దుండగులు ఎలుకతుర్తి మండలం మోడల్ స్కూల్ వద్ద పొలాల్లో వదిలారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతుండగా, అధికారులు వెంటనే స్పందించారు. నాటు కోళ్లను పట్టుకున్న వారు అవి తినకూడదని హెచ్చరిక. ఆ కోళ్లను పరీక్ష నిమిత్తం వరంగల్‌కు పంపించాలని సూచించారు. పరీక్ష ఫలితాలు వచ్చే వరకు ఎవరు తినకూడదని సోషల్ మీడియా ద్వారా అధికారుల విజ్ఞప్తి చేశారు.
