
అక్టోబర్ 29, 2025 5:04PMన పోస్ట్ చేయబడింది
.webp)
బీహార్ ముజఫర్‌పూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కారణంగా. ఈ సందర్భంగా ప్రధాని రాహుల్ మాట్లాడుతు ఓట్ల కోసం మోదీ ఏమైన చేస్తారని..డ్యాన్స్ అడిగితే మోదీ వేదికపైనే డ్యాన్స్ చేస్తారని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చత్ పూజ సందర్బంగా ప్రజలు ఢిల్లీలోని కాలుష్యమైన యమునా నదిలో పూజలు చేసుకుంటున్నారు. కానీ ప్రధాని ప్రత్యేకంగా తయారు చేసిన స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసినట్లు రాహుల్ ప్రకటించారు.
బీహార్‌లో బీజేపీ నేతలు ఓట్ల చోరీలో నిమగ్నమయ్యారని. మహారాష్ట్ర, హర్యానలో ఓట్ల దొంగిలించారని బీహార్‌లోనూ అదే ప్రయత్నించారని అగ్రనేత తెలిపారు. బీజేపీ కేవలం సీఎం నీతీశ్ కుమార్‌ను వాడుకుంటోంది. దేశసంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. బీహార్ వంటి ప్రాంతాలు పేదరికంలో కూరుకుపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగిందని ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు.
మహాగఠ్‌బంధన్ అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రయోజనాలు అందిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆధునిక నలంద విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ హయాంలోనే నాంది పడిందని విపక్ష నేత తెలిపారు
