
అక్టోబర్ 24, 2025 12:44PMన పోస్ట్ చేయబడింది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎలాంటి జాప్యం లేకుండా నిర్దిష్ట బ్యాంక్ ప్రణాళిక ప్రకారం సాగుతున్న పనులపై ప్రపంచ సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ప్రశంసల వర్షం కూడా కురిపించింది. అంతటితో ఆగకుండా రెండో విడతగా అమరావతి నిర్మాణం 17వందల కోట్ల రూపాయల విడుదలకు పచ్చ జెండా ఊపింది. ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ మూడు లేదా నాలుగోవారానికల్లా ఈ నిధులు ఏపీకి అందుతాయి. ఈ నిధులతో రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకుంటాయనడంలో సందేహం లేదు. అమరావతి మొదటి దశ నిర్మాణం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది మార్చిలో తొలి విడతగా 207 మిలియన్ డాలర్లను విడుదల చేసింది. ఆనిధుల్లో 50 శాతం మేర నిధులను ప్రభుత్వం వివిధ పనులకు ఖర్చు చేయడం కూడా జరిగిపోయింది.
ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం తొలి విడత విడుదల చేసిన నిధులలో 75 శాతం ఖర్చు చేసిన తరువాత మాత్రమే రెండో విడత నిధులు విడుదల అవుతాయి. అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నిధులలో ఇప్పటి వరకు 50 శాతం ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొలి వారం నాటికి మరో పాతిక శాతం కూడా రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేసింది. అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు కూడా ఈ పనుల వేగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందుకే డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో రెండో విడత నిధులకు వరల్డ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భావించవచ్చు. అమరావతి నిర్మాణ కేంద్రం గ్యారంటీతో వరల్డ్ బ్యాంకును నిధులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ బ్యాంకు ప్రతినిథులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రూపొందించబడింది. అంటే అమరావతి నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు. మొత్తం ప్రపంచబ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్(ఏడీబీ), కేంద్రం గ్రాంట్లతోనే నిర్మితమౌతోంది. ఇక ప్రపంచబ్యాంక్, ఏడీబీ రుణాల రూపంలో అందజేస్తున్న నిధులకు సంబంధించిన రీపేమెంట్ బాధ్యత అంతా కేంద్రానిదే. దీంతో ఎవరెన్ని కుట్రలు పన్నిలా, అడ్డంకులు సృష్టించినా ఇక అమరావతి నిర్మాణ వేగం మందగించే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.
